నవతెలంగాణ- తాడ్వాయి
సుప్రసిద్ధ, ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క-సారక్క వనదేవతలను క్యూ న్యూస్ మీడియా అధినేత తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు, ఎండోమెంట్సా అధికారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులు కోటి పైచిలుకు వస్తారని .. అధికారులు దానికి అనుగుణంగా సకల సౌకర్యాలుు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ చార్జి రజనీ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, ములుగు జిల్లా కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య, కిషన్, జిల్లా కమిటీ సభ్యులు మార్త శ్రీనివాస్, రాసాల సురేష్, తాడ్వాయి మండల కన్వీనర్ సురేందర్ సింగ్ ఠాగూర్, కొకన్వీనర్ మల్యాల మనోహర్, జిల్లాల కన్వీనర్లు రవి పటేల్, పాము రఘు, రమేష్ నాయక్, కోదాడ శ్రీనివాస్, రామన్, ఉపేందర్,జీడీ హరీష్,శేఖర్ నాని, మండల టీమ్ మద్దెల మహేష్ భీమయ్య,బాలు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:13PM