అయప్ప స్వామి కృపతోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గురు స్వాములు, స్వామి మాలధారకులు
బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ కంటేశ్వర్
అయ్యప్ప స్వామి అనుగ్రహం, సుబ్బారావు గురు స్వామి ఆశీర్వాదంతో నే శబరి యాత్ర విజయవంతం అయిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ అన్నారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ స్వామి నిజామాబాద్ నుంచి శబరిమల పెద్ద పాదం వరకు 228మంది స్వాములను తీసుకెళ్లి అయప్ప స్వామిని దర్శనం చేయించారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ స్వామి 200మందికి పైగా స్వాములు ఆదివారం నగరంలోని బోర్గం(పి) కమాన్ నుండి శ్రీలక్ష్మీ గణపతి ఆలయం వరకు మేల తాలాలు, మంగళ వాయిద్యాలతో గుర్రముపై ఘనంగా తీసుకెళ్లి ఆలయంలో కుటుంబ సభ్యులతో పాటు సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ స్వామి మాట్లాడుతూ.. తాను కేవలం నిమిత్త మాత్రుడినని... అయప్ప స్వామి అనుగ్రహం, సుబ్బరావు గురుస్వామి ఆశీర్వాదం వల్ల 228 మంది స్వాములకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ఇందులో అనేక మంది గురుస్వాములు కన్నెస్వాములను తీసుకొచ్చి సేవలో పాలుపంచుకున్నారన్నారు. అయప్పస్వామి కృపతో అద్బుతమైన జ్యోతి దర్శన చేసుకోవడం మహాభాగ్యమన్నారు. తనని పెద్ద వాడిగా చేయవద్దని, మీ మధ్యనే ఉంటూ మీలో ఒకడిగా మీ ఆప్యాయతల మద్య ఉంచాలని అన్నారు. అయప్ప స్వామి అనుగ్రహం వల్ల కరోనా సమయంలో కూడా ఇంత మంది స్వాములు శబరి మలకు వెళ్లి స్వామిని దర్శించుకోవడం జరిగిందని, గురుస్వామి సుబ్బరావు ఆశీర్వాదంతో చేపట్టిన పడిపూజ, శబరిమల యాత్ర విజయవంతం అయిందన్నారు. అనేక సంవత్సరాలకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ధర్మరక్షణ కోసం ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిమేరకు కృషి చేస్తున్నానని, అందులో భాగంగా ఆలయాల అభివృద్ది, నూతన ఆలయాల నిర్మాణం, పెండ్లిలకు, పేరంటాలకు, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులోనూ అనేక మంది తనకు సహకారం అందించడం గర్వంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులు సైతం కరోనా సమయంలో స్వాములను పంపించడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అగమయ్యా గురు స్వామి,పార్శీ రాజు,మంచాల జ్ఞానెందర్,గంగ రత్నం,లాబీశెట్టి శ్రీనివాస్,ధన్ పాల్ ఉదయ్,ప్రణయ్ ,వినయ్ సుమారు 200 మంది స్వాములు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:48PM