నవతెలంగాణ కంటేశ్వర్
యువతరానికి స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఏ ఐ ఎస్ బి నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ నాగరాజు అన్నారు. ఆదివారం నేతాజీ విగ్రహానికి అల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (ఏ ఐ ఎస్ బి) నిజామాబాద్ జిల్లా కో-కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ హెల్త్ క్లబ్ హెల్త్ క్లబ్ వద్ద నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ సాయుధ పోరాటమే స్వతంత్ర సాధనకు ఏకైక మార్గమని నమ్మిన పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అని అన్నారు.దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తిచేసేందుకు జై హింద్ నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి దేశానికి ఒక బలమైన సైన్యాన్ని రూపకప్పన చేసిన స్వరాజ్య సంగ్రామ యోధుడన్నారు. నేతాజీ ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో యువత నడవాలని నాగరాజ్ కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు సతీష్ ,సాయి కుమార్ ,లవ్ కుమార్ ,అక్షయ్, గోపి నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:54PM