పనుల పరిశీలనల పై ఆకస్మిక తనిఖీ, పలు ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం మహా జాతరకు ముందస్తుగానే భక్తులు వనదేవతల దర్శనానికి అధిక సంఖ్యలో వస్తుండడంతో, వనదేవతల దర్శనానికి వస్తున్న భక్తులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. ఆదివారం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు , గోవిందరాజు వనదేవతలను ప్రభుత్వ లాంచనాలతో వారు దర్శించుకున్నారు. అనంతరం మేడారం లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ చేశారు. మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించు కోవాలి అని తెలిపారు. ముందస్తుగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, త్రాగునీరు, మరుగుదొడ్లు ఉపయోగం లో పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన షేడ్స్ జిల్లా పంచాయితీ రాజ్ అధ్వర్యంలో నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. జంపన్న వాగు లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. కో విడ్ ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా కరోన నియమ నిబంధనల ప్రకారం దర్శించుకుని, ఎవరి ఇండ్లకు వారు ప్రశాంతంగా వెళ్లాలని తెలిపారు. గత జాతర కంటే ఈసారి జాతరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, ఎండోమెంట్ ఈఓ రాజేంద్రం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:59PM