నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చాట్ల మహేందర్, ఉపాధ్యక్షుడిగా శ్యాంకుమార్, ప్రధాన కార్యదర్శిగా సమీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శిగా రామ్మోహన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాధు రవి, కోశాధికారిగా అన్వేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నవీన్, రాజేశ్వర్, వినయ్ కుమార్, జావిద్, సలీం, కలీంబాయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ తూ.. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ ప్రత్యేకంగా పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm