నవతెలంగాణ-భిక్కనూర్
నిరుపేద కుటుంబానికి మానవతా దృక్పథంతో మోటాటి పల్లి సర్పంచ్ రాజేశ్వరి రాజిరెడ్డి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. గ్రామానికి చెందిన కనకవ్వ కుటుంబంలో అత్త, మామ, భర్తను కోల్పోయారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బాధిత కుటుంబానికి 2,500 రూపాయల నగదు, క్వింటాల్ బియ్యం అందజేసి ఆదుకున్నారు. ఆపద సమయంలో ఆదుకున్న సర్పంచ్ ని బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm