- ఎమ్మెల్యే రసమయికి కాంగ్రెస్ మండలాద్యక్షుడి ప్రశ్న
- దళిత బందు టీఆర్ఎస్ బందువవుతుందని ఆరోపణ
- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,ఆనారోగ్య చికిత్స కోసం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ నాయకులతో కలిసి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటింటికి వెల్లి అందజేయడం అభినందనీయమేనని..రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తామని హామిలిచ్చిన మిగతా సంక్షేమ పథకాలేవని కాంగ్రెస్ మండలాద్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు.ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయడమే ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్యే రసమయి పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగిందేమి లేదన్నారు.దళిత బంధు టీఆర్ఎస్ బంధువుగా మారుతొందని మండలంలో పలువురి నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని.. ఆర్హులైన వారికి మొదటగా దళిత బందు అందజేసి లబ్ది చేకూర్చలని సూచించారు.ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల సమయంలో అధికారం కోసం టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు రూ.లక్ష రైతు రుణమాఫీ,స్వంత స్థలాల్లో ఆర్హులైన వారికి డబుల్ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం,నూతన రేషన్ కార్డుల మంజూరీ,ఆసరా పెన్షన్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడం వాటిపై కూడా ఎమ్మెల్యే రసమయి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2022 05:48PM