- బీడీ కార్మికుల ఇతర సమస్యలను పరిష్కరించాలి
- బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కి డిమాండ్ నోటిస్
- బీడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ
నవతెలంగాణ కంటేశ్వర్
బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరి కార్మికులందరికీ వేతనాలు పెంచాలని బీడీ కార్మికుల కు ఇతర సమస్యలను ఏవి ఉన్న వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ఫ్యాక్చర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ అధ్యక్ష కార్యదర్శుల కు డిమాండ్ నోటీసు శుక్రవారం బీడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ సందర్భంగా తెలంగాణ బీడీ& సిగార్ వర్కర్స్ యూనియన్( సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ మాట్లాడుతూ నిరంతరం పెరుగుతున్న ధరల వల్ల బీడీ కార్మికుల కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. చేసే పనికి అతి తక్కువ వేతనం (కూలీ) రావడంతో పెరిగే ధరల ముందు వచ్చే ఆదాయం ఎటూ సరిపోవడం లేదు. కార్మికుల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వేతనాలను వినిమయ ధరల సూచికి అనుగుణంగా సవరించడం లేదు. అతి తక్కువ రేట్లకే (కూలీ) 12-14 గంటలు పని చెయ్యాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన కమీషన్ రూ.18,000/-ల కనీస వేతనం అమలు చేయాలని సిఫారసు చేసింది.దీన్ని ప్రాతిపదికగా చేసుకొని సిఐటియుతో సహా కేంద్ర కార్మిక సంఘాలు ఈ కాలంలో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని నెలకు రూ. 21,000/-లు వేతనం నిర్ణయించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి.
బీడీ కార్మికులకు గతంలోనూ వేతనాలు పెంచే విషయంలో అటు ప్రభుత్వం కానీ, ఇటు యాజమాన్యాలు గానీ సరైన న్యాయం చేయటంలేదు. అరకొరగా వేతనాలు పెంచి బీడీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలు బీడీ పరిశ్రమ షెడ్యూల్డ్ పరిశ్రమగా ఉంది. కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది.బీడీ కార్మికులకు గతంలో కూడా వేతనాలు పెద్దగా పెరిగింది లేదు. కనుక కనీస వేతనం రూ.21,000/-లు ఇవ్వాలి. బీడీ రోలర్స్ కి 1,000 బీడీలకి కనీస కూలీ రూ. 807/-లు ఉండాలి. బీడీ పరిశ్రమలో అత్యధికులు మహిళలు. అట్టడుగు వర్గాలకు చెందినవారు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. సకాలంలో వేతన సవరణ చేయకపోవడం, వేతన సవరణలో నామమాత్రంగా వేతనాలు పెంచడం, పెంచిన వేతనాలు అమలు చేయకపోవడంతో బీడీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు..ఈ నేపథ్యంలో బీడీ ప్యాకింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.21,000/-లు నిర్ణయించాలి. నెల వేతనాలు పొందే కార్మికులు క్లర్క్, చెకర్స్, బట్టీ కార్మికులు నెలసరి వేతనాలు పొందే వివిధ కేటగిరీల కార్మికులందరికీ కనీస వేతనం రూ.21,000/-లు ఇవ్వాలని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. నేడు బీడీ కార్మికులకు నెలకు 26 రోజులు పని దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీడీ కార్మికుల జీవితాలుదయనీయంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మేము కోరుతున్న డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలించి, కోర్కెలను ఆమోదించాల్సిందిగా కోరుతున్నామన్నారు.
బీడీ కార్మికులకు 1,000 బీడీలకు రూ.807/-లు ఇవ్వాలి. బీడీ ప్యాకర్స్, సార్టర్, ట్రైపిల్లర్, నెల వేతనాలు పొందే కార్మికుల కనీస వేతనం రూ.21,000/-లు ఇవ్వాలి.క్లర్క్, చెకర్స్, బట్టీ చటాన్ కార్మికులు నెలసరి వేతనాలు పొందే వివిధ కేటగిరీల కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలి.నెలకు 26 రోజులు పని కల్పించాలి.పిఎఫ్, ఇఎస్ఐ, బోనస్ చట్టాలను విధిగా అమలుచేయాలి. 1,000 బీడీలకు నాణ్యమైన ఆకు ఇవ్వాలి అని ఈ సమస్యలు అన్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎన్.ఎల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నూర్జహాన్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2022 05:56PM