- జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
- విధులు నిర్వహించి విగత జీవిగా మృతి
- ఉలిక్కిపడ్డ సహచర విద్యార్థులు
- చెదిరిన విద్యార్థిని కలలు
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి డాక్టర్ శ్వేత విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చునని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేనా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. డాక్టర్ శ్వేత (35)కరీంనగర్ జిల్లాకు చెందినవారు కాగా, ఆమె అన్న జార్ఖండ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమె మరణ వార్త విన్న సహచర మెడికోలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.వైద్య విద్యార్థులు ఆసుపత్రికి చేరుకొని శ్వేత మృత దేహాన్ని చూసి షాప్ కు గురయ్యారు.మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ సమాచారాన్ని బాధిత కుటుంబీకులకు తెలపగా, ఆమె తల్లదండ్రులు కళావతి, శ్రీనివాస్ హూ టాహుటిన కరీంనగర్ నుంచి జిల్లా జనరల్ ఆసుపత్రికి చేరుకున్నారు. విగత జీవిలా మృత్యువాత పడ్డ తమ శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి అందరినీ కలతకు గురిచేసింది. ఎంతో శ్రమకోర్చి తమ బిడ్డను ఉన్నత వైద్యురాలిగా తీర్చిదిద్దాలని ఆశించిన ఆ తల్లిదండ్రుల కలలు చెదిరి పోయాయి. బాల్యం నుంచి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్వేత ఎంబిబిఎస్ పూర్తి చేసి,పిజిలో సీటు సాధించి నిజామాబాద్ వైద్య కళాశాలలో గైనకాలజి విభాగంలో చేరారు. పీజీ వైద్య విద్యార్థిని శ్వేత మరణంపై అనుమానాలు వ్యక్తం కాగా, జనరల్ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.ప్రతిమ రాజ్ వివరణ కోరగా, ఆమె మరణం సహజ మరణమని చెప్పారు.గతంలో 2 పర్యాయాలు కరోనా భారిన పడ్డారని, ఆ వ్యాధి ప్రభావంతోనే హఠాన్మరణం చెంది ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెడికో మృతిపై ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతితో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా.. లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేనా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. డాక్టర్ శ్వేత మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా మృతురాలి సోదరుడు డిప్యూటీ కమిషనర్ కావడంతో ఆయన వచ్చే వరకు పోస్ట్మార్టం నిర్వహించలేదు.సాయంత్రం మృతురాలి సోదరుడు జార్ఖండ్ నుంచి నిజామాబాద్ కు రావడం తో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఒకటవ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2022 07:35PM