- కేసు నమోదు
నవతెలంగాణ - అశ్వారావుపేట:
దుకాణం నిర్వాహకురాలిని దుర్భాషలాడి, దాడికి ప్రయత్నించిన ఇద్దరిపై అశ్వారావుపేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ చల్లా అరుణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని దురదపాడులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న కూరం వీరవెంకమ్మ వద్దకు అదే గ్రామానికి చెందిన మడకం కిరణ్, మడకం వెంకటేశ్ లు గురువారం రాత్రి వెళ్లి నిత్యవసర సరకులు అప్పు ఇవ్వమని అడిగారు. అందుకు ఆమె గతంలో ఆరువు తీసుకున్న వాటి డబ్బులే ఇవ్వలేదని, మళ్లీ అరవుగా సరకులు ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వారు ఆమెను దుర్భాషలాడి, దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితురాలు వీర వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ అరుణ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2022 08:28PM