నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 16 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలియజేశారు. ఇట్టి ఉద్యోగమేళాకు అపోలో ఫార్మసీ (APOLLO PHARMACY) హైదరాబాద్ జిల్లా, రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్ (Retail trainee Associate, pharmacy assistant), ట్రైనీ ఫార్మసిస్ట్ (Trainee pharmacist), Pharmacist ఉద్యోగాలు తెలియజేసినారు విద్యార్హత Inter/Degree/D.Pharm/B.Pharm/M.Pharm(with PCI )ఆ పైన వయోపరిమితి 18 సం'ల నుండి 30 సం'ల వరకు ఉండాలని తెలియజేశారు. కావున ఆసక్తి గల నిరుద్యోగులకు ఉద్యోగమేళాలో జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో పాల్గొనగలరు ఇతర వివరములకులకు 9959456793,6305743423 ఫోన్ ద్వారా సంప్రదించగలరు అని తెలిపారు. లేదా జిల్లా ఉపాధి కార్యాలయం ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10-00 నుండి మధ్యాహ్నం 2-00 గంల లోపల తేదీ 16-05-2022 నాడు జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీ నగర్ నిజామాబాద్ వివరాలు బయో డేటా,ఆధార్ కార్డు,పాసుపోర్టు సైజు ఫోటో యొక్క సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని తెలియజేశారు.