నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
జాతీయ స్థాయి గేమ్స్ ఈనెల 11 నుండి 15 వరకు బెంగళూరులో జరిగుతున్నాయి అందులో ఇండియన్ మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ లో 35 సంవత్సరాల ట్రీబూల్ జంప్ లో తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లా విద్యుత్ సంస్థలో పని చేస్తూన్న సీనియర్ అసిస్టెంట్ ఎ.గోపి గోల్డ్ మేడల్ సాధించారు. టెస్టర్ ఎంఆర్టి విద్యుత్ సంస్థలో పనిచేస్తూ ట్రిబూల్ జంప్ లో వగ్మారె దినేష్ సిల్వర్ మేడల్ సాధించారు. వారణాసి లో జరిగిన అథ్లెటిక్స్ డిస్క్ త్రో లో సబ్ ఇంజనీర్ ఎండి ఖమర్ పతకం సాధించారు. విజేతలందరిని హైదరాబాదు లో టిఎస్ ట్రాన్స్ కో స్పోర్ట్స్ జనరల్ బాడీ లో ట్రాన్స్ కో జిఎం డి.శ్రీనివాస్ ముగ్గురిని సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఎస్ఈ, అధ్యక్షులు రాపల్లి రవీందర్, కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గంగా రామ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాజశేఖర్, కోశాధికారి సురేష్ కుమార్, ఆర్ గేమ్ సెక్రెటరీ శంకర్ నాయక్, నాగరాజ్, శ్రీరామ్ మూర్తి డిఈ లు వెంకటరమణ, ఎండి ముక్తార్, షలియ నాయక్ తదితరులు అభినందించారు.