- చేజింగ్ చేసి పట్టుకున్న కానిస్టేబుల్
నవతెలంగాణ-భిక్కనూర్
ఒకవైపు తరచూ ఆటోలు ప్రమాదాలు గురవుతున్న ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు. ఫుల్లుగా మద్యం సేవించి రోడ్డుపై హల్చల్ చేసిన ఆటో డ్రైవర్ ని చేజింగ్ చేసి మరి పోలీసులు పట్టుకున్నారు. శనివారం భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఓ ఆటో ఆటో డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి ఆటో ను నడుపుతూ ఆర్టీసీ బస్సుకు అడ్డుగా వచ్చాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ కు ఆటో డ్రైవర్ కు మద్యం వాగ్వాదం జరిగింది. దీనిని గమనించిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తుండగా ఆటో డ్రైవర్ అక్కడి నుండి ఆటో డ్రైవింగ్ చేస్తు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ చేజింగ్ చేసి ఆటోలో ఎక్కి ఆటోను చౌరస్తాలో నిలిపివేశారు. అనంతరం డ్రైవర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. మద్యం సేవించి రోడ్డుపై హల్చల్ చేసిన ఆటో, ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2022 05:20PM