- దళిత సంఘాల అద్వర్యంలో ఎంపీ దర్మపురి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-బెజ్జంకి
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ భిక్ష వల్ల నేడు ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాజ్యాంగం మారుస్తామని వాఖ్యలు చేసిన నిజమాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి ఆరవింద్ దిష్టిబొమ్మను దళిత సంఘాల నాయకులు దహనం చేశారు.రాజ్యాంగం జోలికి వస్తే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.దళిత సంఘాల నాయకులు చిలుముల దేవదాసు,ఎలుక దేవయ్య,బోనగిరి శ్రీనివాస్,వడ్లూరీ పర్శరాం,బొనగిరి గంగారం,బోనగిరి ఆనంద్,పొత్తూరి అంజి,రాజయ్య, బోయిని సంపత్,లింగాల బాబు,రామంచ సారయ్య,కోడముంజ శంకర్,కనగండ్ల శంకర్,కొంపెల్లి నారాయణ,లింగాల శ్రీనివాస్,జేరిపోతుల రాజయ్య, కనగండ్ల సంపత్,గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.