నవతెలంగాణ కంటేశ్వర్
రాష్ట్రంలో జరుగుతున్న కేసిఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు సభలో పాల్గొనడానికి ఇందూర్ నగరం నుంచి పెద్దఎత్తున బిజేపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్ పాలన పేద ప్రజలను ముంచడానికి తప్ప పెద్దగా ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు లాభ పడ్డట్టు దాఖలాలు లేవని ఎద్దేవ చేశారు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత చేపట్టారని, ఈ యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందన్నారు. శనివారం సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారని, దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారని తెలిపారు. కేసిఆర్‌కి కొడుకు, మనవడి మీద ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబ తెలంగాణ చేసుకున్నారని విమర్షించారు. రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వాని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రావడం శుభ పరిణామం అన్నారు. ఇందూర్ అర్బన్ నుంచి సుమారు 45 వాహనాలతో భారీ ర్యాలీగా తుక్కుగూడ బహిరంగ సభకి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి,కార్పోరేటర్లు న్యాలం రాజు,మల్లేష్ యాదవ్,సుక్క మధు, మెట్టు విజయ్,పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్,రాజశేఖర్ రెడ్డి,మీసేవ శ్రీనివాస్,ఇప్పకాయల కిషోర్,ఎర్రం సుదీర్, ఇల్లెందుల ప్రభాకర్,తో పాటు మరి కొందరు కార్పోరేటర్లు, జోన్ అధ్యక్షులు రోషల్ లాల్ బోరా, పుట్ట వీరేంధర్, మఠం పవన్, భాస్కర్ రెడ్డి, బట్టికరి ఆనంద్, ఆకాష్, పవన్, బిజేపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.