నవ తెలంగాణ :నవీపేట్: మండలంలోని నందిగామ గ్రామ ఎస్సీ కాలనీలో సి సి రోడ్డు కై ఎంపీటీసీ లలితా సంజీవ్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను హైదరాబాద్లోనే నివాసంలో కలిసి శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాల నుండి ఉన్న ఎస్సీ కాలనీలో సి సి రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా 5 లక్షల సి డి ఎఫ్ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలపడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.