నవతెలంగాణ-భిక్కనూర్
పదవ తరగతి విద్యార్థుల హాల్ టికెట్ కోసం ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. శనివారం నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సమయంలో జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల విషయంలో హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. పాఠశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వని సమయంలో, ఒకవేళ హాల్ టికెట్ పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కూడా పరీక్షా కేంద్రానికి అనుమతి ఉంటుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm