నవ తెలంగాణ-నవీపేట్: మండలంలోని మహాంతం గ్రామంలో అభివృద్ధి పనులకు సర్పంచ్ రాజేశ్వర్ ఎమ్మెల్సీ కవితకు శనివారం విన్నవించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ లతోపాటు విలేజ్ కమిటీ హాల్, అంగన్వాడి భవనం ,ఎస్సీ కమ్యూనిటీ భవనం, 60వేల లీటర్ల నీటి ట్యాంకు మరియు మహంతం నుండి కమలాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని ఆమె దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పనుల విషయమై అధికారులతో మాట్లాడి పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సర్పంచ్ రాజేశ్వర్ తెలిపారు.