నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో గత 8 రోజుల నుండి జరిగిన బీరప్ప పండగ ఉత్సవాలు శనివారం తో ఘనంగా ముగిసాయి. గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల కు చెందిన కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొని 8రోజుల పండుగను విజయ వంతం గా ముగించారు. ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన భక్తులకు, ప్రజలకు బీరప్ప కురుమ సంఘం తిర్మన్ పల్లి వారు ప్రత్యేక ధన్యవాదాములు తెలిపారు.