- ఎంఅర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మునుగూరి ప్రణీత్ మాదిగ
- ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి కనక ప్రమోద్ మాదిగ..
నవతెలంగాణ డిచ్ పల్లి
రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగ బద్ధమైన పదవులలో ఉన్న ప్రజా ప్రతినిధులు రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్నా తీరును చూస్తుంటే సిగ్గుగా ఉందని ఎంఅర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మునుగూరి ప్రణీత్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి కనుక ప్రమోద్ లు అన్నారు. సెక్యూలర్ రాజ్యాంగాన్ని మార్చాలని ఆరోపిస్తూ , మారుస్తాం అంటూ అహంకార పూరితంగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ యూనివర్సిటీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ధర్మపురి అర్వింద్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జి కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ లు భారత రాజ్యాంగాన్ని మార్చాలని భయంకరమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు , రాజ్యాంగం పై గౌరవం లేని రాజ్యాంగ వ్యతిరేకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల్లో తిరిగే రోజులు ఉండవని స్పష్టం చేశారు . అధికారంలో ఉన్నాం కదా అని పిచ్చి కూతలు కూయడం మానుకోవాలని అర్వింద్ ను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ కో ఆర్డినేటర్ చెల్లపెల్లి దినేష్ మాదిగ , కన్వీనర్ బొల్లారపు వెంకట రమణ మాదిగ,ఎంఎస్యు నాయకులు బాలు యాదవ్ , అర్భజ్ ఖాన్, ఎంఎస్ఎఫ్ నాయకులు ప్రణీత్ మాదిగ , సింహాద్రి మాదిగ , మహర్షి మాదిగ , సాయి మాదిగ , ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు