- బంగారం,నగదు స్వాధీనం...
నవతెలంగాణ-మంథని : మంథని పట్టణంలో ఇటీవల రెండు ఇళ్లలో జరిగిన దొంగతనం కేసులో నిందితున్ని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామగుండం ఏసిపి గిరి ప్రసాద్ నిందితుని దొంగతనం వివరాలను వెల్లడించారు.మంథని పట్టణం సుభాష్ నగర్ లో పొన్నం శ్రీనివాస్,పొన్నం చంద్రయ్య కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి దైవదర్శనానికి వెళ్లారు.వారు లేని సమయం చూసి గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన బంగారు ఆభరణాలు,నగదు, దొంగిలించారని వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు.ఈ నేపథ్యంలో పట్టణంలోని సీసీ కెమెరాల ద్వారా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గ్రామానికి చెందిన బండ.సంపత్ అనే వ్యక్తిని గుర్తించినట్లు ఆయన తెలిపారు.శనివారం సోమగూడెంలోని అతని ఇంటి దగ్గర సంపత్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనంను నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుని నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు,రూ.15వేల నగదును స్వాధీనపరచుకొని అరెస్టు చేశామని, నిందితునిపై గతంలో పలు దొంగతనం కేసులో పీడీ యాక్ట్ లో జైలుకు వెళ్లారని ఏసీపీ గిరి ప్రసాద్ తెలిపారు.సంపత్ ను రిమాండ్ నిమిత్తం నిందితున్ని కోర్టులో హాజరు పర్చామని ఆయన పేర్కొన్నారు. నిందితున్ని పట్టుకోవడం లో చాకచక్యంగా వ్యవహరించిన మంథని సీఐ సతీష్,ఎస్ఐచంద్ర కుమార్,సిసిఎస్,ఎస్ ఐ మహేందర్,సిబ్బంది సతీష్,కిరణ్,సదానందం,రాజకుమార్ లను ఆయన అభినందించారు.ఈ సమావేశంలో సీఐ.జి.సతీష్,ఎస్ఐ చంద్ర కుమార్,సిబ్బంది,పాల్గొన్నారు.