నవతెలంగాణ - అశ్వారావుపేట: ఉమ్మడి జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా అశ్వారావుపేట మండలం వినాయకపురం కు చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు నియామకం కావడం పట్ల శనివారం సన్మానించారు.మండల పరిధిలోని నారాయణపురం లోని సహకార సంఘం కార్యాలయం వద్ద పార్టీ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందించారు. కరోనా సమయంలో వందలాది గిరిజనులు,పేదలకు నిత్యావసరాలు,బియ్యం నామ ముత్తయ్య ట్రస్ట్ ఆద్వర్యంలో పంపిణీ చేశారని,పేదలకు అందించిన సేవలకు గుర్తింపుగా టీఏసీ మెంబర్ గా అవకాశం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జుజ్జురి వెంకన్నబాబు,గొడవర్తి వెంకటేశ్వరరావు,చందా లక్ష్మీనర్సయ్య,చిన్నంశెట్టి వెంకట నరసింహా, నులకాని శ్రీనివాస్, చందు వేణుగోపాల్, చందా కుమారస్వామి పాల్గొన్నారు.