నవతెలంగాణ--చేర్యాల
మండలంలో జీలుగ విత్తనాలు వేసే రైతులకు చేర్యాల పట్టణ కేంద్రం లోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న రైతు ఆగ్రో సేవా కేంద్రం 2 లో విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి ఎండీ. అఫ్రోజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.30 కిలోల బ్యాగ్(బస్తా)రూ.665 ఉంటుందని, ఒక బ్యాగ్ జీలుగ విత్తనాలు రెండు ఎకరాల ఇరవై గుంటలకు సరిపోతుందని తెలిపారు. రైతులు తమ యొక్క పట్టాదారు పాస్ బుక్,ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకొని తమ ఏ ఈ ఓ సంప్రదించి పర్మిట్ తీసుకోవాలని రైతులను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm