నవతెలంగాణ కంటేశ్వర్
గోసంగి లు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మొపాల్ మండల గోసంగి సంఘం నూతన కమిటీని జిల్లా గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ మోపాల్ మండలంలో గోసంగీలు విద్య,ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనకబడి ఉన్నారని వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోపాల్ మండలంలో దళితబంధు పథకం గోసంగిలకు కేటాయించకపోవడం బాధకరమని రెండవ విడత దళితబంధులో గోసంగిలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి రాసరి నరేష్, సలహాదారులు నిరగొండ బుచ్చన్న,ఆర్మూర్ మండల అధ్యక్షులు నిరగొండ సాయిలు, నాయకులు కొండపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మోపాల్ మండల కమిటీ ఎన్నిక..
అధ్యక్షులుగా నిరగొండ గంగారాం, ఉపాధ్యక్షులుగా మిరియాల అశోక్, భూమయ్య,కొండపల్లి కాశిరామ్, గడ్డం రమేష్ కోశాధికారిగా మిరియాల వెంకటి సహాయ కార్యదర్శులుగా మిరియాల ఎల్లయ్య ఇర్నాల మల్లేష్, మిరియాల సీతారాం. ప్రచారకార్యదర్శిగా నిరగొండ రమేష్, ముఖ్యసలహదారుగా మిరియాల గంగారాం, సలహాదారుగా గంధం సాయిలు మెంబెర్లుగా మొగులయ్య, అశోక్, రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2022 04:31PM