నవ తెలంగాణ: నవీపేట్: మండల కేంద్రంలో 2001- 2002 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు రిటైర్డ్ ఆర్మీ జవాన్ సయ్యద్ నజీర్ ను శాలువా కప్పి మెమొంటోతో ఆదివారం సన్మానించారు. రెండు దశాబ్దాల అనంతరం కలిసిన ఆర్మీ జవాన్ నజీర్ గత మార్చి 31న రిటైర్మెంట్ కావటంతో ప్రత్యేకంగా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించి 17 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసిన తమ మిత్రుడికి సన్మానం చేసి ఎంతో గర్వంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ గౌడ్, రాము, నర్సయ్య, రాజు,రవి, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు