నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగానే, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు, జర్నలిస్టులకు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన వారికి ఉచితంగా నగదు రహిత వైద్యం అందించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం విజ్ఞప్తి చేసింది. ఎవరితోనూ సంప్రదించకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు హెల్త్ స్కీం కు రెండు శాతం కంట్రిబ్యూషన్ ఇస్తామని, 1శాతం ఇస్తామని ప్రకటించడం కార్పోరేట్ ఆస్పత్రులకు లాభం చేకూర్చడమే. పెన్షనర్లు ,జర్నలిస్టులు ఆరోగ్య సంరక్షణ పథకానికి కంట్రిబ్యూషన్ ఇవ్వటం సాధ్యం కాదని జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు ,ప్రధాన కార్యదర్శి కే .రామ్మోహన్రావు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వెల్నెస్ సెంటర్లలో సిబ్బంది కొరతను తీర్చాలని మందులను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ రాజు, ముత్తారం నరసింహ స్వామి, జార్జ్, ఇ. వి. ఎల్. నారాయణ జిల్లా నాయకులు హమీద్ ఉద్దీన్, శిర్ప హనుమాన్లు,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.