నవతెలంగాణ రాయపోల్ : టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా ఉండి అక్కున చేరుకుంటుందని దివంగత ఎమ్మెల్యే రామలింగ రెడ్డి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు చినోళ్ల రాజు గారి నానమ్మ రామవ్వ ఎడ్లబండి ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుందని అలాంటి రామవ్వ ఎడ్లబండి ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని రాజుకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్ గుప్త, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు మండల అధ్యక్షులు మున్న, దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంభులింగం, నాయకులు జనార్దన్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.