-రాయపోల్ తహసీల్దార్ శ్రీవల్లి
నవతెలంగాణ రాయపోల్ : అకాల వర్షాలు కురవడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నదాతలు అధైర్య పడవద్దని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని రాయపోల్ తాసిల్దార్ శ్రీవల్లి అన్నారు. ఆదివారం మండలంలోని మంతూర్, చిన్న మాసాన్ పల్లి, కొత్తపల్లి పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలు కురవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాలలో నానా అవస్థలు పదుతున్నరని ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ భారీ వర్షాలు కురవడంతో అక్కడ అక్కడ ధాన్యం తడిసి అన్నారు. అకాల వర్షాల బారినుండి కాపాడుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఉపయోగించుకోవాలని, కేంద్రానికి వచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్ లకు పంపించే ఏర్పాటు చేస్తున్నామని, కేంద్రాలలో ఏలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.రైతులు పండించిన పంటను విక్రయించడానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు, రైతులు సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మున్న, ఆర్ఐ భాను ప్రకాష్, మంతూర్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, కొత్తపల్లి ఉపసర్పంచ్ మల్లేష్, వీఆర్వోలు, సిఏ లు తదితరులు పాల్గొన్నారు.