- అక్కడికక్కడే మృతి..
నవతెలంగాణ డిచ్ పల్లి : రాజస్థాన్ నుండి తన మామ వస్తున్నాడని ఇంటికి తీసుకుని రావడానికి వేచి ఉన్న వ్యక్తిని ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పున్మారం అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జాతీయ రహదారి 44 నాగపూర్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ ఐ కచ్చకాయల గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని నడ్ పల్లి గ్రామానికి చెందిన పున్మారం తన మామ కోసం ద్విచక్ర వాహనం తీసుకొని జాతీయ రహదారి 44 గేట్ వద్ద వేచి ఉన్నారు ఏదో గుర్తుతెలియని వాహనం అతివేగం అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టి తలపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.