నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కోటగల్లీ లోని మార్కండేయ మందిరం వద్ద 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పద్మశాలి కల్యాణ మండపం పనులని సోమవారం పరిశీలించారు. మార్కండేయ ఆలయంలో పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న పద్మశాలి కల్యాణ మండపం పనుల పురోగతి వివరాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు. మార్కండేయ మందిరం అభివృద్ధి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందున ఆ నిధులతో చేపట్టాల్సిన పనులని అధికారులకు తెలిపారు. పద్మశాలి కల్యాణ మండపం, మందిరం అభివృద్ధి కోసం, హాస్టల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గణేష్ బిగాల ని నగర పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నుడ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ ధర్మపురి, పద్మశాలి సంఘం నగర అధ్యక్ష-కార్యదర్శులు ఎస్ ఆర్ సత్యపాల్-బిల్ల మహేష్, యాదగిరి,హన్మాండ్లు, భాస్కర్, దేవి , శివ,గంగ రాజు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 04:15PM