నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కనీస వేతనాల నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయడం ఆపాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న, కార్యదర్శి దాస్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా కార్మికులకు సంబంధించిన జీవోలను, కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం సరికాదని వారన్నారు. షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జాబితా చేయబడిన, కొన్ని పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసి ఒక సంవత్సరం దగ్గర పడుతుందని, వెంటనే గెజిట్ లో ఎక్కించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం చట్టాన్ని అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఒక దిక్కు కనీస వేతనం 21వేలు ఉండాలని ప్రతిపాదిస్తూ, మరో దిక్కు అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరి చేయించుకోవడం భావ్యం కాదని వారన్నారు. కెంద్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం విస్మరించి, 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి కార్మికుల హక్కులను హరించి, ఎనిమిది గంటల పని విధానం 12 గంటల పని విధానం తీసుకొచ్చి, ఉద్యోగ కార్మికులను కట్టుబానిస గా మారుస్తున్నదని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డెబ్భై రంగాలకు గాను ఐదు రంగాల్లో మాత్రమే సవరణ చేసి, 70 రంగాల్లో పట్టించుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. ఐదు రంగాల్లో న్ కనీస వేతన సవరణ చేసి, ఫోటోలు విడుదల చేసిన వాటిని వెంటనే గదిలో ప్రచురించి వెంటనే అమలు చేయాలని, 70 రంగాల్లో తక్షణమే కనీస వేతన సవరణ చేసి గెజిట్ లో ప్రచురించి వాటి అమలుకు పూనుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన నాటికి, నేటికి రాష్ట్రంలో అమలు కావడం లేదని, వెంటనే అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు శివకుమార్ సూర్యశివాజీ, నీలం సాయిబాబా, జె.పి.గంగాధర్, ఎస్కే అబ్దుల్, పోశెట్టి, సుంకరి శ్రీనివాస్, మచ్చ మోహన్, వి.పద్మ, వి.బాలయ్య, చిట్టక్క, చొప్పరి గంగాధర్, భానుచందర్, గంగాధర్, నందిపేట రాజన్న, రాజు, ఫిరోజ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 05:22PM