నవతెలంగాణ కంటేశ్వర్
గ్రామ పంచాయతీ సిబ్బంది పి ఆర్ సి తరహా వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సి ఐ టి యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ట్రంలో 12,705 గ్రామ పంచాయతీలలో సుమారు 30,000 మంది సిబ్బంది పారిశుధ్య, నర్సరీ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్ళు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులలో వివిధ సిబ్బంది పని చేస్తున్నారు. 2011 జనాభా ప్రకారం 500 కుటుంబాలకు ఒక కార్మికున్ని కేటాయించి వీరికి 2018లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.51 ప్రకారం రూ.8,500/-ల వేతనం చెల్లిస్తున్నారు. ఈ వేతనాలు కూడా నేటికీ అందరికీ అందడం లేదు. కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తూ వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడికి సిద్ధమైంది. 2021 జనాభా ప్రకారం కొత్త కార్మికులను నియమించకుండా చేయిస్తున్నారు. మల్టీపర్సన్ వర్కర్ పేరుతో పంచాయితీ సిబ్బందిని పండుగలు, ఆదివారాలలో సైతం పనులు చేయిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ మధ్య కొన్ని జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్లు విధి నిర్వహణలో ట్రాక్టర్ క్రింద పడి మరణించడం జరిగింది. పంచాయతీ సిబ్బందికి రక్షణ కరువైంది. వేధింపులు, తొలగింపులు అధికమయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన ఎస్ధ రూ.2,00,000/-ల ఇన్సూరెన్స్ అమలుకు నోచుకోక సిబ్బంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉదోగులకు వేతనాలు పెంచారు. ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి, సర్పంచులకు కూడా వేతనాలు పంచాయితీ సిబ్బందికి మాత్రం పెంచలేదు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు వెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు.కావున తమరు జోక్యం చేసుకొని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.60 ప్రకారమైనా కేటగిరీల వారీగా రూ. 15,600/-లు, రూ. 19,500/-లు, రూ.22,750/-లుగా వేతనాలు పెంచాలి. కారోబార్, బిల్ కలెక్టర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా కల్పించి పంచాయితీ అసిస్టెంట్ గా నియమించాలి. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్రంలో మేజర్ పంచాయితీలలో ఆదాయకొ మున్నచోట సిబ్బందికి వేతనాలు పెంచుకొనుటకు తమరి ద్వారా ప్రభుత్వనికి తెలియజేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. పంచాయితీ సిబ్బందికి కూడా పిఆర్ సి తరహా జీఓ నెం. 60 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన వివిధ కేటగిరీల వారీగా రూ.15,600/-లు, రూ.19,500/-లు, రూ.22,750/-లుగా వేతనాలు చెల్లించాలి. నెం. 51 సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చెయ్యాలి. 2022 సంవత్సర జనాభాను పరిగణలోకి తీసుకొని సిబ్బందిని నియమించాలి. అందరికీ వేతనాలు చెల్లించాలి.. తోలగించిన పంచాయతి సిబ్బందినందరిని పనిలోకి తీసుకోని ఉద్యోగ భద్రత కల్పించాలి.కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి. పంచాయతీ అసిస్టెంట్ గా నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలి.ఎస్డే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలి.పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. మేజర్ పంచాయితీలలో ఆదాయమున్నచోట వేతనాల పెంపుకు అనుమతినివ్వాలి. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.పంచాయితీలో పని చేస్తున్న అర్హత గల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలి` అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ నీలా గంగవ్వ ధర్మేందర్ గంగారం పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.