సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
పేద ప్రజలకు ఉపాధి కలిగించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారని సీపీఐ(ఎం) గోవిందరావుపేట మండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పసరా రంగాపూర్. ఇప్పల గడ్డ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆగి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లిస్తున్నదని, ఇతర పథకాలకు స్వ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు అన్న సాకుతో కేంద్ర ప్రభుత్వం నేరుగా చెల్లించేందుకు సిద్ధ పడిందన్నారు. కేంద్రం నేరుగా అమలుపరుస్తున్న అందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే రాయితీలను తాము ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారంగా ఇరు ప్రభుత్వాలు పేదవాడికి అన్నం పెట్టే పథకాన్ని నీరుగారుస్తున్నరన్నరు. దీనిలో భాగంగా గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం వాటర్ బిల్లు. గడ్డపార మొన బిల్లు. వేసవి అలవెన్సులు. కొలతలు వ్యత్యాసం చూపిస్తూ శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ చేయడం జరిగిందన్నారు. ఉపాధి కూలీలకు కనీసం నీడ (టెంటు) సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అటవీ ప్రాంతంలో గుంతలు తీస్తే సుమారు 1200 వరకు కూలీకి వచ్చేవని ఈసారి 800 కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొట్లాటలో ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకం బలై పోతుందని అన్నారు. ఈ పరిస్థితులపై ఉపాధి హామీ కూలీలకు ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. గతంలో మాదిరిగా కూలీలకు న్యాయం జరగాలని అందుకోసం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పొదిళ్ల చిట్టి బాబు. జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు యానాల విజయ. తీగల మంజుల. ధర్మారెడ్డి. నాగరాజు. ఆది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 05:51PM