ఎంపీపీ సూడి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలం లోని బుస్సపూర్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లకు ఐటిడిఎ నుండి 30 లక్షల రూపాయలు మంజూరుకాగా స్థానిక సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కోట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పల్లె ప్రగతి లో భాగంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ బస్స పూర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా గ్రామ అభివృద్ధిలో భాగంగా 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఐటిడిఎ నుండి జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయడం జరిగిందని... సిసి రహదారి పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
బస్సపూర్ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలు అభివృద్ధి కోసం
నిధులు ఖర్చు చేస్తున్నారు అన్నారు. పల్లె సీమలను స్వర్గసీమ లు గా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సూరపనేని సాయి కుమార్,లకావత్ నర్సిమహా నాయక్,బూరెడ్డి మధు,కేదారి,చందర్ రాజు,కరుణాకర్, పాశం శ్రీనివాస్ రెడ్డి,కుమారస్వామి, మునవార్,సాంబయ్య, బొల్లం రవి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 05:59PM