కార్యకర్తలు మహనీయుల చరిత్ర,త్యాగాలు తెలుసుకోవాలి...
స్వేచ్ఛ దివాస్ సమావేశంలో పుట్ట మధు పిలుపు...
నవతెలంగాణ-మంథని
మంథనిలో 30 ఏండ్ల కాంగ్రెస్ చీకటి పాలనపై విస్తృతంగా చర్చ జరగాలని జెడ్పి ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. మహనీయుల చరిత్ర,త్యాగాలు తెలుసుకోవాలని కోరారు. మహనీయుల చరిత్రకు సంబంధించిన చర్చ జరగాలి అనే పుస్తకాన్ని పుట్ట మధుకర్ సోమవారం ఆవిష్కరించారు.తన పుట్టినరోజు సందర్భంగా మంథని సమీపంలోని ఎస్.ఎల్.బిఫంక్షన్ హాల్ లో స్వేచ్చా దివస్ సమావేశాన్ని జయ శంకర్ భూపాలపల్లి జడ్పి ఛైర్మన్ జక్క.శ్రీహర్షిని అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పుట్ట మదూకర్ మాట్లాడుతూ
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆడబిడ్డలకు పుస్తె మట్టెలు అందించానని అన్నారు. కరెంటు మీటర్లు పెట్టుకోవద్దని చెప్పి మనల్ని కరెంటు దొంగలుగా తయారు చేసింది ఎమ్మెల్య్ శ్రీధర్ బాబని ఆరోపించారు. ఎలెక్షన్లు వస్తున్నాయని అన్న తిరుగుతున్నాడు,తమ్ముడు దిగాడాని పరోక్షంగా శ్రీధర్ బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. శ్రీపాద రావు కుటుంబంలోఎవరి పెండ్లైనా ధన్వాడలో జరిగిందా?అని ఆయన ప్రశ్నించారు.ఇప్పుడు గుళ్ళు,వడుగులు పేరిట మీడియాలో పెట్టె పోస్టుల పై చర్చించే అవసరం లేదని కార్యకర్తలకు చెప్పారు. చర్చ మహనీయుల జీవిత చరిత్రలపై, త్యాగాలపై,మంథని ప్రాతంలో మనం చేసిన అభివృద్ధి గురించి జరగాలన్నారు. పీవీ తర్వాత నియోజకవర్గంలో బ్రిడ్జి కట్టించిన చరిత్ర తనదని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబం దోచుకోవడానికే పదవులపై ఆరాటామని విమర్శించారు.కాంట్రాక్టర్ లను బెదిరించి డూప్లెక్స్ ఇండ్లు కట్టుకున్నాడని ఆరోపించారు.
సింగరేణి భూ నిర్వాసితుల గురించి శ్రీధర్ బాబు ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదన్నారు. ఉద్యోగ,ఉపాధి కోసం ఎప్పుడూ ఆలోచించడని ఆయన దెప్పి పొడిచాడు.అగ్ర కులం పాలనలో మనం నలిగిపోవద్దని కార్యకర్తలకు సూచించారు. రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని పసలేని అనువాదం చేసి మంథని పరువుతీసిన ఘనత శ్రీధర్ బాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు. ఇక పై నియోజక వర్గంలోని ప్రతీ గడపా తిరుగుతానని కార్యకర్తలను కడుపులోపెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చారు. పదవులు పొందిన నాయకులు కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శ్రీధర్ బాబుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా రాదని జ్యోష్యం చెప్పారు. తన కుటుంబంలో నా కొడుక్కో,బిడ్డకో పదవులు అక్కరలేదు అని, నాలాగా సామాన్యుడు ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. పుట్ట మధు పార్టీ మారుతున్నాడట, టికెట్ రాదట, అదిష్టానం పక్కకు పెట్టిందట అనే బూటకపు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తన ప్రసంగంలో పదేపదే మహనీయుల జన్మ స్థలాలు,సంస్మరణ స్థలాలు,వారి త్యాగాల గురించి వివరించారు. అంబేద్కర్, కొమురం భీం,జ్యోతీ రావు పూలే,చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య,షేక్ బందగి,సర్దార్ సర్వాయి పాపన్న,పండుగ సాయన్న,సంతు సేవాలాల్ గురించి అవలోకనం చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు .భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రతిపక్ష నేత కుట్రలను పసిగట్టాలన్నారు. జనం మార్పు కోరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత,రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,మంథని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ,ఎంపిపి కొండ శంకర్,జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్,భూపాలపల్లి జడ్పి చైర్మన్ జక్కు శ్రీ హర్షిణి, చల్లా నారాయణ రెడ్డి, కొత్త శ్రీనివాస్,ఏగోళపు శంకర్,కనవేన శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 06:17PM