నవతెలంగాణ-మంథని
పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్, మంథని నియోజక వర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలను ప్రజా ప్రతినిధులు,నాయకులు సోమవారం ఆయన నివాస గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ,ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఎంపీపీ కొండ శంకర్,జెడ్పిటిసి సుమలత శంకర్ లాల్, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాంభట్ల సంతోషిని,రైతు బంధు సమితి అధ్యక్షుడు ఆకుల కిరణ్,మంథని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్,బత్తుల సత్యనారాయణ,అనంత రెడ్డితో పాటు మంథని మున్సిపల్ కౌన్సిలర్లు,సింగిల్విండో డైరెక్టర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పుట్ట మధుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 06:19PM