నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్ ను సోమవారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య, ఎస్సై ఆనంద్ గౌడ్ లు జిల్లా కేంద్రంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఫోక్స్ కోర్టు ఇన్ చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నంద రమేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm