ప్రాణం మీదికి తెచ్చిన హెల్త్ ప్రొఫైల్ సర్వే
నవతెలంగాణ- తాడ్వాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హెల్త్ సర్వే లో బయ్యక్కపేట వి ఆర్ ఏ సబిత, ఆశ చంద పార్వతి లు బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని నీలాలతూగు గుత్తి కోయ గూడెం కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వారు ద్విచక్ర వాహనం పైనుండి పడ్డారు. దాంతో వీఆర్ఏ సబితకు మోకాలు కీలు తొలగిపోయి కాలు విరిగింది. ఆశ చంద పార్వతికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటన తెలుసుకొని స్థానిక తాసిల్దార్ ములకనూరు శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ కిషోర్, తాడ్వాయి వైద్యాధికారి లు వెళ్లి బాధితులను పరామర్శించారు. డ్యూటీ లో ఉండి, విధినిర్వహణలో ప్రమాదం జరిగినందున వీఆర్ఏ సబితకు ఎంత ఖర్చు అయినా కలెక్టర్ ఆదేశానుసారం వైద్యం చేయిస్తామని, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 06:59PM