-బీఎస్పీ అద్వర్యంలో ఘనంగా బుద్ద జయంతి వేడుకలు
నవతెలంగాణ-బెజ్జంకి
కుల,మత,వర్గ భేదం లేకుండా సమత మమతలను పంచి జనుల హితాన్ని కోరిన మహానీయుడు తథాగథ్ సిద్ధార్థ గౌతమ బుద్దుడేనని బీఎస్పీ జిల్లా నాయకులు పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఎస్పీ అద్వర్యంలో 2566 బుద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బుద్దుడి ప్రతిమకు బీఎస్పీ, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు.బీఎస్పీ నాయకులు లింగాల శ్రీనివాస్, నిషాని సురేశ్,టీఏవైఎస్ మండలాద్యక్షుడు వడ్లూరీ పర్శరాం,కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాద్యక్షుడు చెప్యాల శ్రీనివాస్,దళిత ప్రజా సంఘాల నాయకులు కొంపల్లి రాజు,లింగాల బాబు,సంగెం మధు, బోనగిరి నవీన్,మైల భాస్కర్,మంకాల రాజు, ఎస్టీయు మండలాద్యక్షుడు రామంచ రవీందర్,గడ్డం శ్రీనివాస్,వడ్లకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 07:00PM