నవతెలంగాణ చివ్వేంల
టీఆర్ఎస్ తిమ్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు గాయం సంజీవ రెడ్డి తండ్రి గాయం వెంకట్ రెడ్డి ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం తిమ్మాపురం లో గాయం వెంకట్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్,మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, ధరావత్ బాబు నాయక్, ఉట్కూరి సైదులు,సర్పంచ్ జాల మానస జైరాం, జటంగి నాగరాజు యాదవ్, రమేష్ రెడ్డి, నంద్యాల జనార్దన్ రెడ్డి, పల్లేటి నాగయ్య, బోయిల కృష్ణ, ఉప్పుల మల్లేష్, లలిత్, మంజూరు బాబా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm