నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి (ఇంజనీర్ ఇన్ చీఫ్ నేషనల్ హైవేస్ సి ఆర్ ఎఫ్ అండ్ బిల్డింగ్స్) ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు. రైల్వే కమాన్ వద్ద నిర్మిస్తున్న ఆర్ యూ బీ పనులని పరిశీలించారు. అలాగే న్యూ కలెక్టరేట్ రోడ్డులో సెంటర్ మీడియన్ డివైడర్ మధ్యలో నాటిన మొక్కలని పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజేశ్వర్, ఈ ఈ రమేష్ , డిప్యూటీ ఈఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm