నవతెలంగాణ కంటేశ్వర్
మోటారు రంగ కార్మికులపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను బస్టాండ్ ముందు మంగళవారం దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రవాణా రంగంపై, డ్రైవర్లపై దోపిడీకి పాల్పడుతున్నదన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక స్వయం ఉపాధితో బతికీడుస్తున్న ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ ల పై నిలువు దోపిడీకి పాల్పడుతున్నాదన్నారు.
2019 రోడ్ సేఫ్టీ బిల్లు రవాణా రంగానికి గొడ్డలి పెట్టన్నారు. జీవో నంబర్ 714 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫిట్నెస్ రెన్యువల్ కోసం రోజుకు 50 రూపాయల చొప్పున ఫెనాల్టి వేస్తున్నదన్నారు. చలాన్లు కట్టలేక ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసి, తాజాగా వాహనాల ఫిట్ నెస్ పెనాల్టీ పేరుతో దోచుకోవడం దారుణమన్నారు. ఫిట్ నెస్ రెన్యువల్ పెనాల్టీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. 2019 రోడ్ సేఫ్టీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 19వ తేదీన ఆటో, క్యాబ్, లారీల బంద్ చేస్తామన్నారు. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు స్వచ్ఛందంగా బందులో పాల్గొనాలని, ప్రజలు, ప్రయాణికులు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంఘీభావం తెలపాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు నాయకులు డి.గంగాధర్, కిరణ్, రమేష్, రాజేందర్, గోపిగౌడ్, సిఐటియు నాయకులు కటారి రాములు, కృష్ణ, ముజీబ్, అహమ్మద్, పండరి ఏ.ఐ.టి.యు.సి నాయకులు నర్సింగరావు, షేక్ రఫిక్, సాయి, లక్ష్మీనారాయణ, ఐఎఫ్టియు నాయకులు శివకుమార్, రాజు, గంగాధర్, శ్రీను టి.ఆర్.ఎస్.కే.వి నాయకులు శ్రీనివాస్, ఎన్.టీ.ఏ.డి.యూ నాయకులు సాయిలు, వివిధ సంఘాల ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 04:14PM