నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ఆయా సహకార సొసైటీ లలో (మండలంలోని డిచ్పల్లి, మెంట్రాజ్ పల్లి, రాంపూర్ డి, బర్దిపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘలలో) బుధవారం(18 మే) ఉదయం 9:30 నిమిషాలకు జీలుగ విత్తనములు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఉన్న రైతు సోదరులు తమ పట్టా పాసు బుక్కు జిరాక్స్ లను సొసైటీ వద్ద ఇచ్చి వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పర్మిట్ పొంది జీలుగ విత్తనములు పొందాలని సూచించారు.3 0కేజీ బస్తా పూర్తి ధర - 1897.50 రూపాయలు ఉండగా,ప్రభుత్వ సబ్సిడీ - 1233.30 రూపాయలు ఉందని, 30కేజీ బస్తా కు రైతులు 664.20 ఆరు వందల అరవై నాలుగు రూపాయల ఇరవై పైసలు చెల్లించలని పేర్కొన్నారు. జీలుగా విత్తనములు కావలసిన రైతులు మెంట్రాజ్ పల్లిలో 300 సంచులు, బర్దిపూర్ 833, రాంపూర్300,ఖిల్లా డిచ్పల్లి 833ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో సంప్రదించి విత్తనములు పొందాలని రైతన్నలకు సుచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 04:24PM