రైస్ మిల్ లలో సివిల్ సప్లై అధికారులతో కలిసి తనిఖీలు
నవతెలంగాణ-భిక్కనూర్
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మంగళవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, గ్రామాలలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అలాగే వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే మండలంలో ఉన్న పలు రైస్ మిల్ లో తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్ యజమానులు వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్ణ గౌడ్,జిల్లా సివిల్ సప్లై అధికారి జితేందర్, డీఎస్ఓ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఎమ్మార్వో నరసింహులు, మానిటరింగ్ అధికారి సురేష్ కుమార్, ఏడిఏ అపర్ణ,వ్యవసాయ మండల ఇన్చార్జి అధికారి జోష్నా ప్రియదర్శిని, డి టి కిష్ణయ్య, పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, ఎంపీటీసీ కోడూరి సాయ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 05:29PM