నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మంగళవారం మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న సొసైటీ కేంద్రాలకు 6 ధాన్యపు కొనుగోలు ఎలక్ట్రానిక్ కాంటాలు, 8 ప్యాడి క్లీనర్స్, 6 మ్యాచర్ మీటర్లు, 5వందల టార్పాలిన్ల ను మార్కెట్ కమిటీ చైర్మెన్ కుంచాల శేఖర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో సుమారు 15 లక్షల విలువగల యంత్రాలను అందజేసినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పక్షాన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్లురి హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ లు గంగల భూమయ్య,భూమి రెడ్డి,బాలగోని రాజా గౌడ్, ఉప సర్పంచ్ బోడ నరేష్, సొసైటీ డైరెక్టర్లు వంగ లలితా, పురం రాజమౌళి, బుర్రి గోపాల్,జనార్దన్, శ్రీనివాస్, కిష్టయ్య,ఆలయ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రాములు, బిక్కనూర్ సొసైటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, ఎంపీటీసీ ఉప్పల బాబు, కార్యాలయ సీఈఓ తామస్, కార్యాలయ సిబ్బంది గంగారెడ్డి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 05:30PM