ధర్మసాగర్ మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్ల మహేందర్ రెడ్డి.
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండలంలోని గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చల్ల మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్మసాగర్ మండల పరిధిలోని ఉద్యోగస్తుల సుదీర్ఘ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ.. తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగస్తుల ఫోరం రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈనెల 20 నుండి జులై 5 వరకు జరిగే 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా బహిష్కరిస్తున్నామని మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎంపిడివో జోవహార్ రెడ్డి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51ను వెంటనే సవరించి, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ లో పనిచేసే కారోబార్లకు ప్రత్యేక హోదాను కల్పిస్తూ,అర్హులైన సిబ్బందికి పదోన్నతి కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీ వారీగా పిఆర్సి జీతాలు చెల్లిస్తూ, వారికి జీవిత బీమా 10 లక్షల వరకు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొట్టే రాజు, వెంకటస్వామి, కర్ణాకర్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 05:34PM