నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని స్థానిక సింగిల్ విండో సొసైటీ గోదాంలో మంగళవారం ఏ డి ఏ అపర్ణ నిల్వ ఉన్న విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా విత్తనాలు మండలంలో అందుబాటులో ఉన్నాయని, విత్తనాలు అవసరం ఉన్న రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్స్ సొసైటీ కేంద్రంలో అందజేసి విత్తనాలను సబ్సిడీ ద్వారా తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు గోదాంలో ఉన్న జీలుగ విత్తన నమూనాలను సేకరించారు. అలాగే పీఎం కిసాన్ కింద లబ్ది పొందే రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఓ జోష్ణ ప్రియదర్శిని, వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినోద్ పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm