- పట్టించుకోని ఉన్నతాధికారులు
నవతెలంగాణ- తాడ్వాయి
కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరా జల ప్రభ పేరు మార్చి ఏడు సంవత్సరం ల తర్వాత గిరి వికాస్ పేరు తో గిరిజన రైతులకు బోర్, కరెంటు, మోటార్ ఉచితంగా ఇవ్వాల్సిన గిరిజన సంక్షేమ అధికారులు కేవలం బోర్ లు వేసి కరెంటు, మోటర్ లు ఇవ్వడం మర్చిపోవడం తో పేద గిరిజన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా మూడు లక్షలు విలువ చేసే యూనిట్ గిరి వికాస్ పథకం పక్కదారి పట్టింది అనే విమర్శలు వస్తున్నాయి. ఐటీ డిఏ కు ప్రాజెక్టు ఆఫీసర్ లేకపోవడం తో, ఇంచార్జ్ అధికారి గా ఉన్న కలెక్టర్ గిరిజన సమస్య లు పెద్దగా పట్టించుకోకపోవడం తో ములుగు జిల్లా గిరిజన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాడ్వాయి మండలం లో వేసిన బోరు లకు కరెంటు, మోటర్ ల సౌకర్యం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది.ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ఏడు సంవత్సరం ల తర్వాత పెట్టిన గిరి వికాస్ పథకం అవినీతి పరులకు వరంగా మారింది అని విమర్శలు వస్తున్నాయ్