నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అనుమానితులను సోమవారం అర్ధరాత్రి ఒకటవ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు చేతిలో నుండి పోలీస్ స్టేషన్ గోడదూకి పాత నేరస్తులు పరారైనట్లు ప్రచారం జరుగుతుంది. తప్పించుకోవడం పై పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి
చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని నిజామాబాద్ జిల్లా ప్రజలు స్థానికులు పోలీస్ శాఖ అధికారులు సైతం సంబంధిత పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్ ప్రాంతంలో రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వన్ టౌన్ పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక కత్తి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు అనుమానితులను విచారించగా గంగాధర్,గణేష్, సలీం, ముగ్గురు నవిపేట కు చెందిన వారిగా గుర్తించి పెట్రో కార్లో వన్ టౌన్ కు తరలించారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు వన్ టౌన్ పోలీసు అదుపులో ఉండగా అందులోంచి సలీం అనే వ్యక్తి టౌన్ గోడ దూకి పరారయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న పోలీసులు పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గాలింపు కోసం ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు ఒక బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిందితుడి సమాచారం అంతుచిక్కడం లేదు.
అయితే సదరు ముగ్గురు అనుమానితులు గతంలో బైకు దొంగతనంతో పాటుగా, మరికొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో వీరు ముగ్గురు కోర్టుకు సైతం హాజరు అయినట్లు తెలిసింది. అయితే ముగ్గురు వ్యక్తులు కత్తితో తిరగటం, వీరి వద్ద కొంత నగదు సైతం లభించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల కస్టడీలో నుండి ఓ వ్యక్తి పరారీ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కత్తి పట్టుకుని తిరగవలసి అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నేరాల నియంత్రణకు ఎంత కృషి చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని పలువురు అంటున్నారు. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా పోలీస్ శాఖ అధికారులు ప్రవర్తిస్తున్న ట్లు అర్థమవుతుందని చెబుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కే ఆర్ నాగరాజు ఉద్యోగాల భర్తీ కోసమై ఎంతో కసరత్తు చేపడుతున్నారు. అయితే ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం.. ఇప్పటివరకు పరారీలో ఉన్న వ్యక్తిని అనుమానితుడిని పట్టుకోక పోవడం పోలీసులకు సవాల్ మారింది. అసలు నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఎందుకోసం బయటకు వచ్చాడు, ఎలా పారిపోయాడు అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. గోడ దూకి అనుకుంటే ఆ స్థలం లోనే పూర్తిస్థాయి పోలీసులు అక్కడే ఉంటారు ఇది ఏ విధంగా జరిగి ఉంటుంది అనే అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 May,2022 03:39PM