నవతెలంగాణ కంటేశ్వర్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా బిసి ఉద్యమ నేత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ను ఎంపిక చేయడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి మాయ వార్ రాజేశ్వర్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. మే 17 చరిత్రలో నిలిచిపోయే సంఘటన జరిగిందని కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం చాలా సంతోషకరం విషయమని తెలియజేస్తున్నాను అని అన్నారు. ఆర్ కృష్ణయ్యను అభినందిస్తూ ఆయనను ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇది గొప్ప చారిత్రాత్మక నిర్ణయమని తెలుపుచున్నాను అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm